తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ బడ్జెట్​పై కరోనా ప్రభావం.. అంతంత మాత్రంగానే ఆదాయం - బడ్జెట్ తాజా వార్తలు

2021-22లో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలు పెద్దగా పెరిగే ఆవకాశాలేవీ కనపడటం లేదు. ఏటా బడ్జెట్‌ అంచనాలు ఎంతో కొంత పెరగడం సహజం. రెండేళ్లుగా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. 2020-21 బడ్జెట్‌ అంచనాలు కూడా అంతకు ముందు ఏడాదితో సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతకుమించి పెరిగే అవకాశాలు దాదాపు లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

corona affect on state budjet
ఆంధ్రప్రదేశ్​ బడ్డెట్​ అంచనాలు

By

Published : May 15, 2021, 7:53 AM IST

ఏపీ రాష్ట్ర బడ్జెట్‌పైనా కరోనా కాటు పడుతుందా అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. 2021-22 బడ్జెట్‌ అంచనాలు పెద్దగా పెరిగే ఆవకాశాలేవీ కనపడటం లేదు. ఈసారి ఆ రాష్ట్ర పద్దు రూ.2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల మధ్యే ఉండొచ్చని ప్రస్తుత అంచనా. ఏడాది కాలానికి పైగా కరోనా అతలాకుతలం చేస్తుండటంతో రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రంగా మిగిలింది. ప్రతి ఏటా బడ్జెట్‌ అంచనాలు ఎంతో కొంత పెరగడం సహజం. రెండేళ్లుగా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. 2020-21 బడ్జెట్‌ అంచనాలు కూడా అంతకు ముందు ఏడాదితో సమానంగానే ఉన్నాయి.

ఇప్పుడు కూడా అంతకుమించి పెరిగే అవకాశాలు దాదాపు లేవని చెబుతున్నారు. పెరుగుదల ఏదైనా ఉన్నా అది రూ.పదివేల కోట్లకే పరిమితం కావచ్చని సమాచారం. ఇప్పటికే తొలి మూడు నెలల కాలానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ను ఆమోదించింది. రూ.70,983.11 కోట్ల అంచనాతో తొలి 3 నెలల ఖర్చుల ప్రతిపాదనలకు గవర్నర్‌ నుంచి ఆర్డినెన్సు రూపంలో ఆమోదం పొందింది. వచ్చే గురువారం ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయింది. ఇప్పటికే బడ్జెట్‌ లెక్కలన్నీ ఖరారయ్యాయని సమాచారం.

ఆంధ్రప్రదేశ్​ బడ్డెట్​ అంచనాలు

రాబడి అంచనాలు తప్పాయి...

కిందటి ఏడాది ఏపీ అంచనా వేసిన దానిలో దాదాపు రూ.50 వేల కోట్ల మేర తరుగుదల కనిపిస్తోంది. కరోనా కారణంగా కిందటి ఏడాది తొలి మూడు నెలల్లో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు సరిగా లేక రాబడులు తగ్గినా అంతకుముందు ఏడాది ఎంత ఆదాయం వచ్చిందో దాదాపు ఆ మేర రాబడులు దక్కాయి. మిగిలిన రూపాల్లో వచ్చే అంచనాలు తప్పడం వల్లే మొత్తం మీద రాష్ట్ర రాబడులు తగ్గిపోయాయి. కేంద్ర సాయం రూపంలో వస్తుందని లెక్కలు వేసుకున్న మొత్తంలో సగం కూడా అందకపోవడంతో అంచనాలు తలకిందులయ్యాయి. సొంత రాబడులు దాదాపు జీతాలు, పింఛన్లకే సరిపోవడంతో సంక్షేమ పథకాలన్నింటికీ రుణాల రూపంలోనే నిధులు సమకూర్చుకోవాల్సి వచ్చింది.

ఆదాయానికి మించి అప్పులు

ఆంధ్రప్రదేశ్​ బడ్డెట్​ అంచనాలు

ఏపీ రాష్ట్ర ఆదాయం ఎంత ఉందో అంతకు మించి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌ రుణాలతో పాటు కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీలిచ్చి వివిధ రూపాల్లో రుణాలు సమీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రూ.21 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఇతరత్రా కార్పొరేషన్లకు ఇప్పటికే ప్రభుత్వ అర్హత మేరకు గ్యారంటీలు ఇచ్చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి అప్పులపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్​ బడ్డెట్​ అంచనాలు

రుణాల చెల్లింపు భారమూ పెరగనుందని లెక్కలు వేస్తున్నారు. వీటన్నింటి మధ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ కొత్త బడ్జెట్‌ సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ముందడుగు వేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర మౌలిక సౌకర్యాలకు బ్యాంకుల నుంచి నిధుల సమీకరణను బట్టే ముందుకెళ్లనుంది.

ఇదీ చదవండి :అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details