కంటికి ఏదైనా గాయమైతే కార్నియా దెబ్బతిని చూపు పోయే ప్రమాదముంటుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కార్నియాను పూర్తిగా లేదా కొంత మేర మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకు శస్త్రచికిత్సలూ అవసరమవుతాయి. ఇలాంటివేవీ లేకుండానే దెబ్బతిన్న కార్నియాను బాగు చేసి కంటిచూపును రక్షించేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ(HYDROGEL) చేశారు.
HYDROGEL : కంటి చూపును రక్షించేలా... ఐఐటీ ఆవిష్కరణ! - hydrogel cures eye sight problems
కంటికి గాయమై కార్నియా దెబ్బతింటే.. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా దాన్ని పూర్తిగా లేదు కొంతమేర మార్పిడి చేస్తారు. కానీ.. ఇలాంటివేం అవసరం లేకుండా దెబ్బతిన్న కార్నియాను బాగు చేసి కంటిచూపును రక్షించేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ(HYDROGEL) చేశారు.
మనుషులు, జంతువుల నుంచి సేకరించిన కార్నియాలతో వీరు డీసెల్యులరైజ్డ్ కార్నియా మాట్రిక్స్ హైడ్రోజెల్(HYDROGEL)ను సిద్ధం చేశారు. కంటికి దెబ్బతగిలిన వెంటనే దీనిని ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఐఐటీలోని బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో సహ ఆచార్యుడు డాక్టర్ ఫల్గుణిపతి, ఆయన బృందం ఈ ఘనత సాధించింది. ఈ పరిశోధనలో ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త వివేక్‌సింగ్ కీలకంగా ఉన్నారు. ఈ హైడ్రోజెల్(HYDROGEL)ను ఉపయోగించి వీరు త్రీడీ బయోప్రింటింగ్ విధానంలో కృత్రిమ కార్నియానూ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చికిత్స పద్ధతిపై చాలా పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే మనుషులపైనా కొన్ని పైలట్ స్టడీస్ చేయనున్నట్లు పరిశోధక విద్యార్థి శిబు వివరించారు. ఈ మేరకు ఐఐటీ వర్గాలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.
- ఇదీ చదవండి :కంటిచూపు తగ్గుతుందా.. అయితే ఇవి పాటించండి..