కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్, నందమూరి నగర్లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు చేపట్టారు. 200 మంది 15 బృందాలుగా ఏర్పడి 140 ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో నిర్భంద తనిఖీలు - corden search in kphb police station limits
కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, 15 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో భయాందోళనలు పోగొట్టేందుకు తనిఖీలు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు.
కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో నిర్భంద తనిఖీలు
సరైన ధ్రువత్రాలు లేని 55 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. 15 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించి, భయాందోళనలు దూరం చేసేందుకే తరుచూ నిర్భంద తనిఖీలు చేపడుతున్నామని డీసీపీ వెంకటేశ్వర రావు అన్నారు.
TAGGED:
corden search in kphb