హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళానగర్‌లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. రాచకొంచ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు... ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, నిషేదిత గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.
కళానగర్‌లో పోలీసుల నిర్బంధ తనిఖీలు
హయత్‌నగర్ పరిధిలోని కళానగర్‌లో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కళానగర్‌లో పోలీసుల నిర్బంధ తనిఖీలు