తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్న కొడుకును పట్టించిన పోలీస్​

బంధుత్వం కంటే బాధ్యత ముందని ఓ సబ్ ఇన్​స్పెక్టర్​ నిరూపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రుణ యాప్​ల కేసుల్లో చైనా దేశస్థుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు....కాల్ సెంటర్ల నిర్వహాణ, ఆర్ధిక వ్యవహారాలు చూస్తున్న నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కర్నూలుకు చెందిన నాగరాజు తండ్రి ఓ పోలీసు అధికారి. ఆయనే తన కొడుకును పట్టించారు.

కన్న కొడుకును పట్టించిన పోలీస్​
కన్న కొడుకును పట్టించిన పోలీస్​

By

Published : Jan 1, 2021, 5:10 AM IST

తెలుగు రాష్ట్రాల్లో రుణాల యాప్‌ల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. చైనా కంపెనీలు కేవలం ఆర్నెల్లలో రూ.21 వేల కోట్లు కొల్లగొట్టాయి. ఈ కంపెనీల ఆర్థిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు పర్యవేక్షిస్తున్నాడు. ఇతని సోదరుడు ఈశ్వర్‌కుమార్‌ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. నాగరాజును రెండురోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ వెనుక నాగరాజు తండ్రి, పోలీస్‌ అధికారి పాత్ర ఉంది. తన కుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని, ఘరానా నేరానికి పాల్పడ్డాడని ఆ పోలీస్‌కు కొద్దిరోజుల క్రితమే తెలిసింది. ఈ విషయాన్ని నాగరాజుకు చెప్పకుండా కర్నూలుకు రావాలంటూ కోరారు. మూడు రోజుల క్రితం అతను ఇంటికి చేరుకున్నాడు. తక్షణం.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్‌ చేయించారు.

బంధం కంటే పోలీసు బాధ్యత గొప్పదని భావించిన పోలీస్‌ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్‌ ఠాణాలో ఏఎస్సైగా పనిచేస్తున్నానని, తనపేరు, వివరాలు బహిర్గతం చేయవద్దంటూ ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. ఏఎస్‌ఐకు ఇద్దరు కుమారులు ఈశ్వర్‌కుమార్‌, నాగరాజు. వీరు బెంగళూరులో కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసేవారు. తొలుత నాగరాజు యాప్‌ రుణాల సంస్థలో చేరాడు. తర్వాత తన అన్న ఈశ్వర్‌కుమార్‌ను అందులోనే చేర్పించాడు. పోలీసులు నాగరాజును అరెస్టు చేయడంతో ఈశ్వర్‌కుమార్‌ సైతం లొంగిపోయినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:కర్నూలులో పరువు హత్య... బండరాయితో కొట్టిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details