Coolie works in umbrella shade: భానుడి తాపానికి పచ్చని భూములు సైతం మలమలా మాడిపోయి... బీటలు వారుతున్నాయి. ఇంతటి వేడిలో పనులు చేయడానికి కూలీలు జంకుతున్నారు. పంట పొలాల్లో పని చేసేందుకు కూలీలు ఎవరూ రావడం లేదు. దీంతో ఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లా లింగాల, సింహాద్రిపురం మండలాలకు చెందిన చీనీ, నిమ్మ రైతులు ఓ ఆలోచన చేశారు.
అదిరేటి ఐడియా.. గొడుగు నీడలో కూలి పనులు - వైయస్‌ఆర్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
works in umbrella shade: మండుతున్న ఎండల్లో పనులు చేసేందుకు ఎవరు ఇష్టపడతారు.? ఎంత అవసరం ఉన్నా.. ఎండలో పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని కూలీలు సైతం ముందుకు రావడం లేదు. అందుకే ఆ జిల్లాలో కొందరు రైతులు వినూత్నంగా ఆలోచించారు. కూలీలకు ఎండవేడి నుంచి ఉపశమనం కోసం గొడుగులు ఏర్పాటు చేశారు. అదెక్కడంటే.?
గొడుగు నీడలో కూలి పనులు
రైతులు పనిచేసే ప్రదేశంలో కూలీల కోసం గొడుగులు ఏర్పాటు చేశారు. ఈ గొడుగుల నీడలో రైతులు ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతూ పనులు చేసుకుంటున్నారు. ఈ ఉపాయంతో కూలీల కొరత తీరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా ఎండలు పెరిగిపోయాయి. జిల్లాలో గరిష్ఠ ఉష్టోగ్రత 44 డిగ్రీలకు చేరువైంది.
ఇదీ చదవండి:తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని.. మారు తండ్రిని హతమార్చిన 13 ఏళ్ల కుర్రాడు..