భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై అనవసర వివాదం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
'విభేదాలు మన బలహీనతలను బయటపెడతాయి' - అఖిలపక్ష వివాదంపై సీఎం జగన్ స్పందన
భారత భూభాగాలు ఆక్రమణలకు గురికాలేదంటూ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ సమయంలో అనవసర వివాదం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని, కేంద్ర మంత్రులు ఆమోదయోగ్యమైన సమాధానాలిచ్చారని ట్వీట్ చేశారు.
'విభేదాలు మన బలహీనతలను బయటపెడతాయి'
'ఇది మన ఐక్యతను చాటాల్సిన, సాయుధ దళాలకు సంఘీభావం ప్రకటించాల్సిన తరుణం. లోపాలను ఎత్తి చూపేందుకు ఇది సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని, కేంద్ర మంత్రులు ఆమోదయోగ్యమైన సమాధానాలిచ్చారు. ఈ ఆంశంపై జాతి మొత్తం సమైక్యంగా నిలబడాలి. ఐక్యతే బలం. విభేదాలు మన బలహీనతలను బయటపెడతాయి' అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:ఎనభై ఏళ్ల వయసులో యోగాతో అదరగొడుతున్న బామ్మ