తెలంగాణ

telangana

ETV Bharat / city

బదిలీల మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలి : గాదె వెంకన్న - కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన

ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల బదిలీలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆర్జేడీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న డిమాండ్​ చేశారు.

contract lecturers dharna for the transfers of over the state in junior colleges
బదిలీల మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలి : గాదె వెంకన్న

By

Published : Jan 25, 2021, 10:48 PM IST

జూనియర్ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల బదిలీలపై అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. సీఎం స్పందించి తక్షణమే బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆర్జేడీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదెవెంకన్న డిమాండ్​ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలపైనా 70 రోజులైనా ఇప్పటిదాకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఆరోపించారు.

బదిలీల మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలి

అధికారుల తీరును వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ముగించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సానుకూలంగా ఉన్నా మార్గదర్శకాలు విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గాదె వెంకన్న హెచ్చరించారు.

ఇదీ చూడండి :జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి : ఆర్​.కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details