తెలంగాణ

telangana

ETV Bharat / city

' అప్పుడు ఎంత కరెంట్​ బిల్లు కట్టారో ఇప్పుడు అంతే కట్టండి' - march current bill]

లాక్‌డౌన్‌లోనూ విద్యుత్ శాఖ కీలకపాత్ర పోషిస్తోందని ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతోనే డిమాండ్‌పై దృష్టి పెట్టామన్నారు. గతేడాది మార్చి బిల్లులనే ఈ ఏడాది తీసుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. లాక్‌డౌన్ తర్వాత టారిఫ్‌లో తేడా లేకుండా, వినియోగదారులు నష్టపోకుండా చూస్తామని వెల్లడించారు.

jagadeesh reddy
jagadeesh reddy

By

Published : Apr 13, 2020, 2:14 PM IST

గతేడాది మార్చి విద్యుత్‌ బిల్లుతోనే... వినియోగదారులు ఈసారి బిల్లులు చెల్లించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గతేడాదితో పోల్చితే బిల్లులో 15నుంచి 20 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లో విద్యుత్ శాఖ కూడా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతోనే డిమాండ్‌పై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. రీడింగ్‌ ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించాలని మంత్రి కోరారు.

లాక్‌డౌన్ తర్వాత టారిఫ్‌లో తేడా లేకుండా, వినియోగదారులు నష్టపోకుండా చూస్తాం. లాక్‌డౌన్ పూర్తికాగానే 60 రోజుల బిల్లును విభజిస్తాం. మొదటి 30 రోజులకు ఒకటి, రెండో 30 రోజులకు మరో బిల్ అందిస్తాం. ప్రస్తుతం 7,600 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్ ఉంది. వాణిజ్య విద్యుత్‌ డిమాండ్ తగ్గింది.. గృహ వినియోగం పెరిగింది.

-జగదీశ్​ రెడ్డి, విద్యుత్​ శాఖ మంత్రి

ఇదీ చదవండి:మార్కెట్లో చిరుతిళ్లు, డైపర్ల, శానిటరీ నాప్కిన్లు కొరత

ABOUT THE AUTHOR

...view details