తెలంగాణ

telangana

ETV Bharat / city

క్యారీ బ్యాగ్‌కు డ‌బ్బులు వ‌సూలు చేసిన 'స్పెన్సర్‌'.. షాకిచ్చిన క‌స్ట‌మ‌ర్ - Spencer carry bag issue news

Consumer Court on Spencer : క్యారీ బ్యాగ్‌కు మూడు రూపాయలు వసూల్ చేసిన స్పెన్సర్‌కు హైదరాబాద్ రెండో వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. వినియోగదారుడి ఫిర్యాదుతో వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు తొమ్మిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదీకి రూ.10 వేల నష్టపరిహారం, రూ.6 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని తీర్పు చెప్పింది.

Consumer Court on Spencer
Consumer Court on Spencer

By

Published : May 26, 2022, 10:25 AM IST

Updated : May 26, 2022, 11:34 AM IST

Consumer Court on Spencer : క్యారీ బ్యాగ్‌ కోసం వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు తొమ్మిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని స్పెన్సర్‌ రీటైల్‌ లిమిటెడ్‌ను హైదరాబాద్‌ రెండో వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. ఫిర్యాదీకి రూ.10 వేల పరిహారం, రూ.6 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కమిషన్‌ అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు చెప్పారు. లీగల్‌ మెట్రాలజీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ శాఖలు క్యారీ బ్యాగులకు అదనంగా వసూలు చేయకుండా సూపర్‌ మార్కెట్‌, షాపింగ్‌మాల్‌లకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు.

2019 జూన్‌ 25న వి.ఆనందరావు ‘అమీరుపేట సూపర్‌’కు వెళ్లారు. అక్కడ అదనంగా మూడు రూపాయలు కవర్‌ కోసం వసూలు చేసి లోగో ఉన్న కవర్‌ ఇచ్చారు. ‘అమీర్‌పేట సూపర్‌’ షాపు మూసివేసినా రెండో ప్రతివాది స్పెన్సర్‌ రిటైల్‌ లిమిటెడ్‌, ముషీరాబాద్‌ను ఇంప్లీడ్‌ చేసి వినియోగదారుల కమిషన్‌లో విజయం సాధించారు.

Last Updated : May 26, 2022, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details