Funds for MLA Quota MLCs : కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. శాసనసభ కోటాలో ఇటీవల ఆరుగురు మండలికి ఎన్నికయ్యారు. వారిలో ఐదుగురికి జిల్లాలు కేటాయిస్తూ సీడీపీ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు
Funds for MLA Quota MLCs : శాసనసభ కోటాలో ఇటీవల ఎన్నికైన ఆరుగులు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. వారిలో ఐదుగురికి జిల్లాలను కేటాయిస్తూ నిధులు మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Constituency Development Funds MLCs : పాడి కౌశిక్ రెడ్డి - కరీంనగర్ జిల్లా, బండ ప్రకాశ్ - వరంగల్ జిల్లా, కడియం శ్రీహరి - జనగామ జిల్లా, రవీందర్ రావు - మహబూబాబాద్ జిల్లా, గుత్తా సుఖేందర్ రెడ్డి - నల్గొండ జిల్లా ఎంచుకున్నారు. ఒక్కో ఎమ్మెల్సీకి రెండున్నర కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
Funds for MLCs : ఆయా ఎమ్మెల్సీల ప్రతిపాదనలను ఆమోదించే మంత్రుల జాబితాను కూడా ప్రకటించారు. కడియం శ్రీహరి, బండా ప్రకాశ్ ప్రతిపాదనలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమోదించాల్సి ఉంటుంది. గుత్తా ప్రతిపాదనలను మంత్రి జగదీశ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ప్రతిపాదనలను మంత్రి గంగుల కమలాకర్.. రవీందర్ రావు ప్రతిపాదనలను మంత్రి సత్యవతి రాథోడ్ ఆమోదించాలి. వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుంది.