ఏపీలోని విశాఖ నగర శివారులో రెండు గోడల మధ్య ఓ కుక్క ఇరుక్కుపోయింది. చేపల ఉప్పాడ వద్ద జరిగిన ఈ ఘటనలో శునకం గంట పాటు గిలగిలలాడింది. ఆ శునకాన్ని తీసేందుకు స్థానికులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇక లాభం లేదనుకుని.. 100కు ఫోన్ చేశారు. ఓ కానిస్టేబుల్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
Dog Rescue: శిథిలాల్లో చిక్కుకున్న శునకం.. రక్షించిన కానిస్టేబుల్ - vishakha latest news
ఏపీలోని విశాఖలో శిథిలాల్లో శునకం ఇరుక్కుపోయింది. స్థానికులు ఆ కుక్కను బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు 100కు డయల్ చేయగా.. కానిస్టేబుల్ వచ్చి సురక్షితంగా శునకాన్ని బయటకు తీశాడు. గంటపాటు శునకం నరకయాతన అనుభవించింది.
Dog Rescue
ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ విధులను నిర్వర్తిస్తున్న మరో కానిస్టేబుల్ పరవాడ కృష్ణకు ఈ విషయం తెలియడంతో అక్కడకు వెళ్లారు. గోడలను తొలగించి శునకాన్ని సురక్షితంగా బయటకు తీశారు. గంటపాటు నరకయాతన పడ్డ శునకం.. బయటపడగానే హమ్మయ్యా అంటూ పరుగులు తీసింది. శునకాన్ని రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి:TALASANI SRINIVAS: 'గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో మరింత అభివృద్ధి'