పోలీస్ నియామకాల్లో అవకతవకలు జరిగినందున... కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ... తాము ఎంపిక కాలేదని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. హోమంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో కలిసి సచివాలయానికి వచ్చారు. మంత్రిని ఫోన్లో సంప్రదించగా... శుక్రవారం నాడు మంత్రుల నివాస ప్రాంగణం వద్ద తనను కలవాలని సూచించారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన తమ పేర్లు జాబితాలో లేవని... పరీక్ష రాసిన వారందరి మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమ నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా తమ అనుమానాలు నివృత్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
పోలీసు నియామకాల్లో అవకతవకలు... సచివాలయానికి బాధితులు! - protest at secreteriate
పోలీస్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ... తాము ఎంపిక కాకపోవడానికి కారణాలు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలీసు నియామకాల్లో అవకతవకలు... న్యాయం చేయాలని విజ్ఞప్తి
పోలీసు నియామకాల్లో అవకతవకలు... న్యాయం చేయాలని విజ్ఞప్తి
ఇదీ చూడండి: అక్రమ తవ్వకాలపై గవర్నర్ను కలిసిన భాజపా బృందం