తెలంగాణ

telangana

"మున్సిపల్ రిజర్వేషన్‌ ప్రక్రియ సరిగా లేదు"

మున్సిపల్ రిజర్వేషన్‌ ప్రక్రియ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీలకు రిజర్వేషన్‌లు దక్కలేదని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు. అధికారులను పరుగులు పెట్టించి నామమాత్రంగా ప్రక్రియ పూర్తి చేశారని ఆరోపించారు.

By

Published : Jan 5, 2020, 7:12 PM IST

Published : Jan 5, 2020, 7:12 PM IST

"Congressional dissatisfaction with municipal reservation process"
"మున్సిపల్ రిజర్వేషన్‌ ప్రక్రియ పట్ల కాంగ్రెస్​ అసంతృప్తి"

మున్సిపల్ రిజర్వేషన్‌ ప్రక్రియ పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ అసంతృప్తి వ్యక్తం చేసింది. జనాభా దమాషా ప్రకారం.... బీసీలకు రిజర్వేషన్‌లు దక్కలేదని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు. రిజర్వేషన్ ప్రక్రియను తూతూ మంత్రంగా చేయడం వల్ల అన్యాయం జరిగిందని ఆరోపించారు.

"మున్సిపల్ రిజర్వేషన్‌ ప్రక్రియ పట్ల కాంగ్రెస్​ అసంతృప్తి"

మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌ల పరిధిలోని ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయని నిరంజన్ పేర్కొన్నారు. అధికారులను పరుగులు పెట్టించి తూతూ మంత్రంగా చేసిన రిజర్వేషన్ ప్రక్రియకు.. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: 'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'

ABOUT THE AUTHOR

...view details