తెలంగాణ

telangana

ETV Bharat / city

భారత్​ బంద్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్​ - భారత్​ బంద్

రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్​ బంద్​కు కాంగ్రెస్​ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌ నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

congress support to bharath bundh on december 8th
భారత్​ బంద్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్​

By

Published : Dec 6, 2020, 1:14 PM IST

Updated : Dec 6, 2020, 2:28 PM IST

రాష్ట్రంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఈ నెల 8న రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని భట్టి ప్రకటించారు. భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ రైతులను కాపాడుకునేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని భట్టి డిమాండ్‌ చేశారు.

భారత్​ బంద్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్​
Last Updated : Dec 6, 2020, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details