తెలంగాణ

telangana

కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్

పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్​ రెడ్డి రాజీనామా చేసినందున... కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్టు రాష్ట్ర వ్యవహార ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ప్రకటించారు. ఇంతకాలం పార్టీని ఉత్తమ్ కుమార్​ రెడ్డి సమర్థవంతంగా నడిపారని కితాబిచ్చారు.

By

Published : Dec 9, 2020, 8:36 PM IST

Published : Dec 9, 2020, 8:36 PM IST

congress state incharge manikkam tagore announce new pcc president selection start
కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్

కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైనట్టు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. కోర్‌ కమిటి సమావేశానికి ముందు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడిన ఠాగూర్‌... దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ శక్తినంతా ఉపయోగించామని తెలిపారు. పార్టీని ఇంతకాలం ఉత్తమ్‌‌ సమర్థవంతంగా నడిపారని కితాబిచ్చారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినందున... నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టినట్టు మాణిక్కం ఠాగూర్​ తెలిపారు. కొత్త అధ్యక్షుడు ఎంపికయ్యే వరకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. దాదాపు 150మంది పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని వివరించారు. సమస్యలను అధిగమించి సమర్థవంతమైన పార్టీగా త్వరలో రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్

ఇదీ చూడండి:రైతులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి : పొన్నం ప్రభాకర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details