కేసీఆర్ కుటుంబ సభ్యుల అప్రజాస్వామిక చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. ప్రచార కార్యక్రమాన్ని గాంధీభవన్‌లో పీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్ దీపక్ జాన్ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఠాగూర్... భాజపా, మోదీ, అమిత్ షా మాదిరిగా సోషల్ మీడియాలో అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు చేయవద్దని సూచించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.
కేసీఆర్ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలి: మాణిక్కం - telangana latest news
కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాన్ని గాంధీభన్‌లో ప్రారంభించారు. రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ప్రజల్లో ఎండగట్టాలన్నారు.
కేసీఆర్ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలి: మాణిక్కం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల పోలింగ్ బూత్‌లకు కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లను నియమించాలని తెలిపారు. భాజపా, తెరాస చేప్తున్న అబద్ధాల గురించి... ప్రజలకు వాస్తవాలు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై పాలకుల పెత్తనం పెరిగినందున... ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యతం ఇవ్వడం లేదని ఆక్షేపించారు.
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు