దేవుడి ఆశీర్వాదంతోనే తాను, తన భార్య కరోనా నుంచి బతికి బయటపడ్డామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన వీహెచ్ దంపతులు బుధవారం సాయంత్రం డిశ్ఛార్జి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసేందుకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తానని వెల్లడించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా పరుగు, పరుగున వెళ్లే తాను త్వరితగతిన కోలుకోవాలని ఎందరో ప్రార్థనలు చేశారన్నారు. వారందరి ప్రార్థనలు ఫలించడం వల్లే తామిద్దరం వైరస్ బారి నుంచి బయట పడగలిగామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేందుకు తన వంతు కృషిచేస్తానని వీహెచ్ వ్యాఖ్యానించారు.
అభిమానుల ప్రార్థనలతోనే కరోనా నుంచి కోలుకున్నాం: వీహెచ్ - వీహెచ్ తాజా వార్తలు
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. అభిమానుల ప్రేమ వల్లే తాను, తన సతీమణి కరోనా నుంచి కోలుకున్నామన్నారు. కరోనా జాగ్రత్తల విషయంలో ఎవరూ అలసత్వం వహించొద్దని వీహెచ్ కోరారు.
వీహెచ్