తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వర్గీయ నంది ఎల్లయ్య లాంటి నేతలు ఇక పుట్టరు: ఉత్తమ్ - నంది ఎల్లయ్య చిత్రపటానికి నివాళులు

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య సంతాప సభ హైదరాబాద్​లో కాంగ్రెస్​ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డితోపాటు పలువురు సీనియర్​ నేతలు... నంది ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వర్గీయ నంది ఎల్లయ్య లాంటి నేతలు ఇక పుట్టరు: ఉత్తమ్
స్వర్గీయ నంది ఎల్లయ్య లాంటి నేతలు ఇక పుట్టరు: ఉత్తమ్

By

Published : Aug 17, 2020, 9:01 PM IST

Updated : Aug 17, 2020, 11:36 PM IST

దళిత దిగ్గజం, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య లాంటి నిజాయితీ, క్రమశిక్షణ, నిరాడంబరత కలిగిన గొప్ప నాయకులు ఇక పుట్టరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయాలు సాధించేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అధ్యక్షతన... స్వర్గీయ నంది ఎల్లయ్య సంతాప జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు... ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నంది ఎల్లయ్య మరణం పట్ల ఏఐసీసీ ముఖ్యనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు అనేక మంది నాయకులు సంతాపం ప్రకటించినట్టు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. వీహెచ్‌ ఏర్పాటు చేయబోయే విగ్రహానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. నంది ఎల్లయ్య ఎన్ని పదవులు పొందినా ఆడంబరాలు లేకుండా సామాన్య కార్యకర్తగా వ్యవహరించేవాడని... అతనితో ఉన్న సాన్నిహిత్యాన్ని వీహెచ్ గుర్తు చేసుకున్నారు.

నంది ఎల్లయ్య సంతాప సభలో సీల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజా నర్సింహ, మల్లు రవి, సంపత్ కుమార్, గూడూరు నారాయణ రెడ్డి, బొల్లు కిషన్, నిరంజన్, వినోద్ కుమార్, కత్తి వెంకట్ స్వామి, నాయిని రాజేందర్ రెడ్డి, సీపీఐ నాయకులు అజిత్ పాషా, ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్గీయ నంది ఎల్లయ్య లాంటి నేతలు ఇక పుట్టరు: ఉత్తమ్
Last Updated : Aug 17, 2020, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details