గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకానికి అవమానం జరిగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం ఆవేదన కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఆవేదన కలిగించాయి: విహెచ్ - telangana congress news
జాతీయ జెండాను రూపొందించి వందేళ్లయిందని.. రూపకర్తకు సెంటినరీ వేడుకలు ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ నేత వీహెచ్.. ప్రధాని మోదీని ప్రశ్నించారు. పింగళి వెంకయ్యను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఆవేదన కలిగించాయి: విహెచ్
జాతీయ జెండాను రూపొందించి వందేళ్లయిందని... రూపకర్తకు సెంటినరీ వేడుకలు ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పింగళి వెంకయ్యను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. జాతీయ జెండా మీద తన పేరు ముద్రించుకున్న ఇఫ్లూ వీసీ సురేష్‌కుమార్ మీద చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:'త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంతో దేశం దిగ్భ్రాంతి'