వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతుగా... కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ రైతుల వెన్నంటే ఉంటామన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు దిల్లీ పర్యటన తర్వాత ఏమైంది: వీహెచ్
రైతు ఆందోళనలకు మద్దతుగా... హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో కాంగ్రెస్ నేత వీహెచ్ ఓక రోజు దీక్ష చేపట్టారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు దిల్లీ పర్యటన తర్వాత ఏమైంది: వీహెచ్
రైతుల పక్షపాతినని చెప్పుకుంటున్న కేసీఆర్... రైతుల నిరాహార దీక్ష పిలుపును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దిల్లీ పర్యటన తర్వాత ఏమైందని నిలదీశారు. తాను చేపట్టిన దీక్షను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అభినందించినట్టు తెలిపారు.
ఇదీ చూడండి:చర్చల పేరుతో రైతు సంఘాల్లో చీలిక తెస్తున్నారు: బీవీ రాఘవులు