రాష్ట్రంలో అన్యాయమే రాజ్యమేలుతోంది... ప్రశ్నించే గొంతుకలను రాష్ట్ర ప్రభుత్వం అణగ తొక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో రెడ్‌జోన్‌లలో మంత్రి కేటీఆర్ అధికారులతో పర్యటించవచ్చు కానీ.. తాను మాత్రం బయటకు రావడం తప్పా అని ప్రశ్నించారు. రెడ్‌జోన్ అమలులో లేని ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడం నేరమా అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల పట్ల ఒకలా, తమ పట్ల మరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇదేనా సమన్యాయం అని నిలదీశారు. సంఘటనపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
కేటీఆర్‌కు ఒక న్యాయం.. నాకో న్యాయమా? - మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్యాయమే రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ మందిని వేసుకోని తిరగొచ్చా? అని ప్రశ్నించారు. తాను అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి బయటకు వస్తే కేసులు పెడతార? అని నిలదీశారు. కేటీఆర్‌కు ఒక న్యాయం.. నాకో న్యాయమా? అని అన్నారు.
కేటీఆర్‌కు ఒక న్యాయం.. నాకో న్యాయమా?