తెలంగాణ

telangana

ETV Bharat / city

'నూతన ఏడాది నూతనోత్సాహంతో పోరాటాలు చేస్తాం' - తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. 2021లో తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, నిరుద్యోగులు, కార్మికులకు తీవ్రంగా నష్టం చేశాయని ఆరోపించారు. నూతన ఏడాది నూతనోత్సాహంతో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.

congress senior leader uttham kumar reddy says new year wishes
'నూతన ఏడాది నూతనోత్సాహంతో పోరాటాలు చేస్తాం'

By

Published : Dec 31, 2020, 8:55 PM IST

తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఉత్తమ్ కుమార్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2020లో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను పీడించగా, మరోవైపు విపరీతమైన వరదలతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజలు చాలా నష్టపోయారని.. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా, తెరాసలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పీసీసీ ఉపాధ్యక్షడు మల్లు రవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details