తెలంగాణ

telangana

ETV Bharat / city

T-Congress : 'కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు విఫలం' - congress satyagraha strike in telangana

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో, వ్యాక్సిన్ పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ నాయకులు ఆరోపించారు. కొవిడ్ బాధితులకు ఉచితంగా చికిత్స చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

congress satyagraha strike, congress satyagraha strike in telangana
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష, తెలంగాణలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష, తెలంగాణలో కరోనా వ్యాప్తి

By

Published : Jun 7, 2021, 2:04 PM IST

కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో భయానక పరిస్థితులు తలెత్తినా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలకు కారణం సీఎం కేసీఆర్ వైఖరేనని విమర్శించారు. మహమ్మారికి బలైన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.

కరోనా వ్యాప్తిని నిలువరించడంలో.. కొవిడ్ టీకాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీకాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కొవిడ్ బాధితులకు ఉచితంగా చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్​లు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శుల కురిపించారు.

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

ABOUT THE AUTHOR

...view details