గాంధీభవన్లో పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం జరిగింది. భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ.నర్సింహారావు విదేశీ విధానమనే అంశం గురించి నేతలు చర్చించారు.
'ఈ నెల 30న ఇందిరాభవన్లో పీవీ విదేశీ విధానంపై చర్చ' - గాంధీభవన్లో పీవీ.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం
గాంధీభవన్లో పి.వి.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశమైంది. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ విదేశీ విధానంపై కమిటీ చర్చించింది. జూమ్ ద్వారా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది.
'30న ఇందిరాభవన్లో పీవీ విదేశీ విధానంపై చర్చ'
ఇందిరాభవన్లో జూమ్ యాప్ ద్వారా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఎవరెవరు ఏ ఏ అంశాలు మాట్లాడాలనే విషయంపై కమిటీ స్పష్టతనిచ్చింది.