హైదరాబాద్ కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీత రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకదారులను పలకరిస్తూ... హస్తం గుర్తుకు ఓటేసి విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలంటూ కోరారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమేనని ధీమా వ్యక్తం చేశారు.
భర్త గెలుపు కోసం నడుంకట్టిన సంగీతరెడ్డి...! - congress-pracharam
అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలే కాకుండా వారి సతులు కూడా రంగంలోకి దిగి ప్రచారాన్ని సాగిస్తున్నారు. అదే బాటలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ఆయన భార్య సంగీత రెడ్డి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో
TAGGED:
congress-pracharam