కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం : కాంగ్రెస్ - ghmc elections congress manifesto
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో .. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..
కాంగ్రెస్ పార్టీ బల్దియా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వరదల నివారణ, కరోనా చికిత్స, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులు మహిళలకు ఉచిత రవాణా వంటి పలు హామీలు ఈ మేనిఫెస్టోలో రూపొందించారు.
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు
- వరదల నివారణకు అత్యున్నత విధానం
- కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం
- విద్యార్థులు, మహిళలకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
- దివ్యాంగులు, వృద్ధులకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
- ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చర్యలు
- అర్హత కలిగిన వారందరికీ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తాం
- సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల ఆర్థిక సాయం
- 100 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి ఉచిత విద్యుత్
- సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణానికి రూ.4 లక్షల సాయం
- నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకుల దుకాణాలకు ఉచిత విద్యుత్
- 30 వేల లీటర్ల వరకు నల్లా నీళ్లు వాడుకునే వారికి ఉచితంగా నీటి సరఫరా
- ఉచిత ఎల్‌ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలు చేస్తాం
- ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం
- మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తాం
- సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల బీమా సదుపాయం
- కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ
- వీధివ్యాపారులకు ఆరోగ్య, ప్రమాద బీమా
- కొవిడ్ వల్ల దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్సులు
- అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంచుతాం
- సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లకు పన్ను తగ్గింపు
- మాల్స్, మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ
- షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్సుల్లోని పార్కింగ్‌ను జీహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తాం
- యోగా, జిమ్ సౌకర్యాలతో సహా వృద్ధాశ్రమాలు ఏర్పాటు
- అన్ని కాలనీల్లో సీసీకెమెరాలు ఏర్పాటు
- షీ బృందాలను పెంచి మహిళా భద్రతకు పటిష్ఠ చర్యలు
- రాత్రి 10 గంటలకే బార్‌లు, మద్యం దుకాణాలు మూసివేత
- జీహెచ్ఎంసీలో అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్ వ్యవస్థ అమలుచేస్తాం
- జీహెచ్ఎంసీని ప్రజలకు జవాబుదారీగా మారుస్తాం
- ఔటర్ రింగ్‌రోడ్ వెలుపల బహుళ అంతస్తుల టవర్లకు అనుమతులు
- హోర్డింగ్‌లపై గుత్తాధిపత్యం తొలగింపునకు జీవో 68ను రద్దు చేస్తాం