సచివాలయంలోని మసీదు కూల్చివేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నాంపల్లి వక్ఫ్‌బోర్డు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అంజని కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సచివాలయంలోని మసీదును కూల్చినా.. వక్ఫ్‌బోర్డు అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సచివాలయం చుట్టూ రోడ్లు మూసివేసి మసీదును కూల్చేసి మైనార్టీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే.. అదే చోట కొత్త మసీదు నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అంజని కుమార్ యాదవ్ హెచ్చరించారు.
మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. కాంగ్రెస్ ధర్నా!
సచివాలయంలోని మసీదును కూల్చివేయడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో అంజని కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో మసీదు కూల్చివేసినా.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. కాంగ్రెస్ ధర్నా!