పురపాలక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకుకాంగ్రెస్కార్యచరణ రూపొందిస్తోంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకే అప్పగించాలని పీసీసీ నిర్ణయించింది. కమిటీలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు ఇందులో కీలకం కానున్నారు. పురపాలక సంఘాలన్నింటికీ ప్రత్యేకంగా బాధ్యులను నియమించనున్నారు.
లోటు భర్తీపై హస్తం దృష్టి
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరటం వల్ల స్థానికంగా నాయకత్వ సమస్య ఉన్న చోట లోటును భర్తీ చేయటంపై కమిటీలు దృష్టి సారించాయి. ముందుగా ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం చేపట్టనున్నాయి.