తెలంగాణ

telangana

ETV Bharat / city

congress party membership : త్వరలోనే జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ - కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

congress party membership : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశలో పీసీసీ ప్రణాళిక సిద్దం చేసింది. జనవరి 26 నాటికి రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసేందుకు నియోజక వర్గాల వారీగా ప్రత్యేక ఇంఛార్జ్​లను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. త్వరలోనే జిల్లాల్లో పర్యటించి పార్టీ సభ్యత్వాన్ని సమీక్షించడమేగాక ఆయా జిల్లాల్లో నాయకుల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టనున్నారు.

congress party membership
congress party membership

By

Published : Dec 13, 2021, 9:51 AM IST

congress party membership : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి దశల వారీగా పీసీసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీనియర్లు అంతా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కలిసి వస్తుండడం, మహిళా కాంగ్రెస్‌తో ఉన్న చిన్నపాటి సమస్య కూడా సమసి పోవడంతో పార్టీ బలోపేతంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా సోనియాగాంధీ పుట్టిన రోజు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజైన ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ డిజిటల్‌ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి..

congress party membership Fee : ఇప్పటికే 34 వేలకుపైగా మందికి డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం చేశారు. ఏఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని వారం, వారం సమీక్ష చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధంగా జరిగేందుకు వీలుగా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరిశీలకులను, పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఇంఛార్జ్​లను నియమించారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల నాయకులు భాగస్వామ్యం కావాలని పీసీసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికే లక్ష పూర్తి..

congress party membership Registration : నాలుగు రోజుల కిందట మొదలైన డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో మంచి స్పందన వస్తోందని ఈ కార్యక్రమ ఇంఛార్జ్ హర్కర్ వేణుగోపాల్ రావు తెలిపారు. ఉప్పటికే లక్ష మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జనవరి 26 వరకు 30 లక్షల మంది సభ్యులు నమోదు చేసుకునేలా లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు.

30 లక్షలు లక్ష్యం..

Congress membership : ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు లక్షలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 30 వేలు, బూత్​కు వంద లెక్కన సభ్యత్వాలను పూర్తి చేయాలని పీసీసీ లక్ష్యాలను నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా సభ్యత్వాన్ని నిర్వహించిన వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బూత్ స్థాయిలో పీసీసీ నిర్దేశించినట్లు వందకు బదులు రెండు వందలు అంతకు మించి సభ్యత్వం పూర్తి చేయించినట్లయితే వారిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌కు పిలిపించి శాలువాతో సన్మానం చేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ 30 లక్షలు లక్ష్యంగా నిర్దేశించగా పీసీసీ 34 లక్షల సభ్యత్వాలను పూర్తి చేయాలని నిర్ణయించి ఆ మేరకు క్షేత్రస్థాయి లక్ష్యాలను నిర్దేశించింది.

రేవంత్ జిల్లాల పర్యటన

Revanth Districts Tour : మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి త్వరలో జిల్లాల్లో పర్యటించి పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు స్థానికంగా పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలు తదితర వాటిపై సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తన పర్యటన దోహదం చేస్తుందని రేవంత్ భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే ఈ కార్యాచరణకు శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details