తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంగ్రెస్​లో గ్రేటర్ ఎన్నికల సందడి... గెలుపు గుర్రాల కోసం వేట - ఆశవహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింన కాంగ్రెస్​

కాంగ్రెస్‌ పార్టీలో గ్రేటర్‌ ఎన్నికల సందడి మొదలైంది. కాంగ్రెస్‌ తరఫున కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహవంతులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం కోరింది. పార్టీకి విధేయులుగా ఉంటూ.. పార్టీ కోసం పని చేస్తున్నవారు... ఈ నెల 18లోపు దరఖాస్తులను గాంధీభవన్‌లో అందజేయాలని టీపీసీసీ సూచించింది.

కాంగ్రెస్​congress party focus on ghmc electionsలో గ్రేటర్ ఎన్నికల సందడి... గెలుపు గుర్రాల కోసం వేట
congress party focus on ghmc elections

By

Published : Nov 14, 2020, 2:47 PM IST

రాష్ట్రంలో గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు దీపావళి తరువాత నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండడం వల్ల రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ... మండలి ఎన్నికల మాదిరిగానే దరఖాస్తుల విధానంలో ముందుకెళ్తోంది.

పార్టీ విధేయులకే అవకాశం...

గ్రేటర్‌ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి ఉన్న నాయకుల నుంచి పీసీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ లోపు... ఆశావహులు తమ దరఖాస్తులను గాంధీభవన్‌లో ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్​లోని 150 డివిజన్లకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న పీసీసీ... వాటిని పరిశీలించేందుకు సీనియర్‌ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా గ్రేటర్‌లో ఓటరై... పార్టీ విధేయులుగా ఉండి... పార్టీ కోసం పని చేసిన వారినే... గ్రేటర్‌ ఎన్నికల బరిలో నిలిపే దిశలో కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

అన్నీ పరిగణలోకి వస్తాయ్​...

డివిజన్ల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని, దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను కమిటీ గుర్తించనుంది. ఆశావహుల నుంచి వచ్చే దరఖాస్తుల్లో.... ఒక్కో డివిజన్‌కు ముగ్గురు నుంచి ఐదుగురిని ఎంపిక చేసి జాబితాను కమిటీ సిద్ధం చేస్తుంది. అయితే ఈ జాబితా తయారు చేసేటప్పుడు ఇప్పటికే పార్టీ పరంగా యాభై శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని పీసీసీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్లు, బీసీలకు పార్టీ ఇచ్చిన హామీతో పాటు ఇతర అన్ని సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని బలమైన అభ్యర్థుల జాబితా ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

గెలుపు గుర్రాలే లక్ష్యంగా...

తెరాస, భాజపా, ఎంఐఎంల నుంచి ఆయా డివిజన్లల్లో బరిలో దిగే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాలను పార్టీ ఎంపిక చేస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ విధేయులను, స్థానికంగా ప్రజాధారణ కలిగిన వారిని ఎన్నికల బరిలో దింపడం ద్వారా ఆశించిన ఫలితాలు ఉంటాయని పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్రానికి గుండె లాంటి హైదరాబాద్ నగరంలో తమ సత్తా సాటేందుకు పీసీసీ... అన్ని రకాల చర్యలను చేపట్టేందుకు కార్యాచరణ చేపడుతోంది.

ఇదీ చూడండి: నెహ్రూ కీర్తిని తగ్గించేందుకు భాజపా కుట్ర: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details