దిశ హత్యాచార ఘటనలో పోలీసులు తక్షణమే స్పందించి ఉంటే... విషాదం జరిగి ఉండేది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దిశ హత్యాచార ఘటనపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దిశ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు అవమానించారని పేర్కొన్నారు. ఆ ప్రాంతం తమ పరిధిలో రాదంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పడం బాధకరమని అన్నారు.
'ఫిర్యాదు కోసం వెళ్తే పోలీసులు అవమానించారు'
దిశను అత్యంత కిరాతకంగా హత్యచేశారని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ కుమార్తె కోసం ఫిర్యాదు చేసేందుకు వస్తే తమ పరిధిలో రాదంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పడం బాధకరమని పేర్కొన్నారు.
uttam kumar reddy
ఘటనపై రాష్ట్ర హోమంత్రి మహమూద్ అలీ బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని ఉత్తమ్ విమర్శించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'పూటుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు'