రాష్ట్రంలో భాజపా, తెరాసలు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ద్వారా కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకుని నిషేధిత టెక్నాలజీని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆధారాలతో కూడిన అంశాలను ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐకి విచారణ కోసం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై వరుస పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
'రాజకీయాలను తెరాస, భాజపాలు రక్తికట్టిస్తున్నాయి' - congress mp revanth reddy comments on trs and bjp
కేంద్రం నిషేధించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కేసీఆర్ ప్రభుత్వం పవర్ప్లాంట్ల నిర్మాణానికి వినియోగించేలా ఆదేశాలిచ్చిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో రూ.7వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అత్యవసరం ముసుగులో నిషేధిత పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజానీకం మీద భారం మోపారని స్పష్టం చేశారు.
revanth