తెలంగాణ

telangana

ETV Bharat / city

నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్‌ రెడ్డి - రజత్‌కుమార్‌తో రేవంత్ భేటీ

కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే తెలిసి కూడా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్‌కు భయపడి మాట్లాడడంలేదా లేకుంటే కేసీఆర్‌కు చెప్పే చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల వద్ద రాష్ట్ర పోలీసులు ఉండడం వల్ల కృష్ణా గేట్లు రాత్రి తెరుస్తూ రాత్రే మూస్తున్నారని... ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలన్నారు.

revanth
revanth

By

Published : May 14, 2020, 3:38 PM IST

Updated : May 14, 2020, 7:01 PM IST

ఏపీకి కృష్ణా జలాలు తరలిస్తూ తెలంగాణను ఎడారిగా మారుస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాల సమస్య ప్రజల జీవన్మరణ సమస్యగా పేర్కొన్నారు. బీఆర్కే భవన్‌లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ జగన్‌కు లొంగిపోయినా నాటకమాడినా కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదు. దీనిపై పోరాటం చేస్తాం. ప్రధానమంత్రికి లేఖ రాస్తాం. ప్రజలను చైతన్యపరుస్తాం.

-రేవంత్ రెడ్డి

నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్‌ రెడ్డి

ఇదీ చదవండి:'ఇద్దరు సీఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు'

Last Updated : May 14, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details