తెలంగాణ

telangana

ETV Bharat / city

గిరిజనుల రిజర్వేషన్ 10 శాతానికి​ పెంచాలి: జీవన్​ రెడ్డి - mlc jeevanredd latest news

రాష్ట్రంలో గిరిజన జనాభా 10 శాతం ఉన్నందున ఈ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరుశాతం మాత్రమే రిజర్వేషన్‌ ఇస్తున్నందున 4శాతం నష్టపోతున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్​ను 10 శాతానికి పెంచుతూ ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు.

jeevan reddy
jeevan reddy

By

Published : Mar 10, 2020, 6:36 PM IST

గిరిజనుల రిజర్వేషన్​ 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. గిరిజన జనాభా 10 శాతం ఉన్నందున ఈ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభ తీర్మానించిందన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అయినందున 50 శాతం మించకూడదనే నిబంధన వర్తించదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లు 50శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మన రాష్ట్రానికి వర్తించదన్నారు.

రాష్ట్రంలో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్‌ మాత్రమే ఇస్తున్నందున 4 శాతం నష్టపోతున్నారని తెలిపారు. మహారాష్ట్రలో 52శాతం రిజర్వేషన్లు ఉన్నా.. మరాఠాలకు 12శాతం కల్పించారని జీవన్ రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్ర విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్‌ గిరిజన రిజర్వేషన్లు పెంచడానికి కృషి చేయాలన్నారు.

గిరిజనుల రిజర్వేషన్ 10 శాతానికి​ పెంచాలి: జీవన్​ రెడ్డి

ఇదీ చూడండి:రాఘవ లారెన్స్ సోదరుడు వేధిస్తున్నాడు: సినీ ఆర్టిస్ట్

ABOUT THE AUTHOR

...view details