తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో మిల్లర్ల ఒత్తిడితో రైతులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.
Mlc Jeevan Reddy : 'ధాన్యం సేకరణలో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు'
రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు ప్రభుత్వం అబద్ధం చెబుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. క్వింటాకు 5 కిలోల ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సర్కార్ చర్యలతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రైతుల సమస్యలపై జీవన్ రెడ్డి
క్వింటాకు 5 కిలోల ధాన్యం దోపిడీ చేస్తుండడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు.