తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు : ఉత్తమ్​ - గాంధీ భవన్​లో కాంగ్రెస్ సమావేశం

నల్గొండ-ఖమ్మం-వరంగల్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గాంధీ భవన్​లో నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి హాజరై... ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడంపై చర్చించారు.

congress mlc election meeting in gandhi bhavan
గాంధీ భవన్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

By

Published : Feb 14, 2021, 3:12 PM IST

Updated : Feb 14, 2021, 4:16 PM IST

సామాజిక న్యాయం ప్రాతిపదికగా రాములు నాయక్​కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల మండలి ఎన్నికల సన్నాహక సమావేశం గాంధీ భవన్​లో నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఎన్నికల్లో క్రియాశీలంగా పని చేయాలని ఉత్తమ్​ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి ఉందన్నారు. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. గతంలో 43శాతం ఫిట్​మెంట్​ ఇస్తే... ఇప్పుడు 7.5 శాతం ప్రతిపాదిచడంపై తీవ్రంగా మండిపడ్డారు.

ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేయకుండా... యువతను ప్రభుత్వం మోసం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇన్నాళ్లు మభ్యపెట్టారని విమర్శించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన బయ్యారం స్టీల్ పరిశ్రమ, కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ లాంటి అన్ని అంశాల్లో మోసం చేశారని అన్నారు. అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడే భాజపా... భద్రాచలం రాముని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి... అవినీటి సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ఓటర్​ జాబితా సిద్ధం చేసుకొని వ్యక్తిగతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వి.హనుమంతరావు, ముఖ్యనాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ పాలనలో నిర్మించిన వాటికే కొత్త పేర్లు : భట్టి

Last Updated : Feb 14, 2021, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details