సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు. సీఎం, మంత్రులు కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చేయని తప్పుకు పదే పదే క్షమాపణలు చెప్పాలనటం సరైంది కాదన్నారు. శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు.
'సీఎం, మంత్రులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. సభ నడుస్తోన్న తీరు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారింది. ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతోనే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొన్నారు. రైతులు, నిరుద్యోగులు, నిత్యావసరాల పెరుగుదలపై మాట్లాడితే సీఎం తట్టుకోవట్లేదు.'