తెలంగాణ

telangana

ETV Bharat / city

60శాతం ఫిట్‌మెంట్‌ కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ - కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వార్తలు

ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక ఇచ్చి 21 రోజులు గడిచినా.. ఉద్యోగులకు ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. 30 నెలలుగా 9లక్షల మంది ఉద్యోగులు వేచి చూస్తున్న పీఆర్సీని.. తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

congress Mla Sreedharbabu Letter To Cm kcr on employees fitment issue
60శాతం ఫిట్‌మెంట్‌ కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ

By

Published : Jan 20, 2021, 7:25 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు 60శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 30 నెలలుగా 9లక్షల మంది ఉద్యోగులు వేచి చూస్తున్న పీఆర్సీని.. తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు, పదవి విరమణ వయస్సు పెంపు చేయాలని కోరుతూ సీఎంతోపాటు త్రిసభ్య కమిటీ ప్రతినిధులకు మెయిల్ ద్వారా లేఖ ప్రతిని పంపించారు.

31వ తేదీన..

2018 మే 16న ఉద్యోగుల సంఘ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ పీఆర్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు రిటైర్డు ఐఏఎస్‌లతో కమిటీ వేశారన్నారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరినా.. 30 నెలల తరువాత గత నెల 31వ తేదీన ప్రభుత్వానికి అందిందని వివరించారు.

21 రోజులు గడిచినా..

2019 జూలైలో ఏపీలోని ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతిని ఇచ్చారని, తెలంగాణ ఉద్యోగులకు ఐఆర్‌, ఫిట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక ఇచ్చి 21 రోజులు గడిచినా.. ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, చర్చలు లేకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే ఉద్యోగులు కోరుకుంటున్నట్లు 2018 జూలై 1 నుంచి 60శాతం ఫిట్​మెంట్‌ను రాష్ట్రంలోని 9 లక్షల మంది ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు.

ఇదీ చూడండి: పోలీసుల కోసం ప్రత్యేక మాస్కులు.. అందించిన రాచకొండ సీపీ

ABOUT THE AUTHOR

...view details