కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష భగ్నం..అరెస్ట్ - seethakka arrest
![కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష భగ్నం..అరెస్ట్ congress mla seethakka arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11554519-834-11554519-1619515389116.jpg)
14:04 April 27
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ అమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీతక్కను, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా ఇందిరాపార్క్ వద్ద సీతక్క, వెంకట్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇవాళ వీరిని వైద్యులు పరీక్షించారు.
ఎమ్మెల్యే సీతక్కకు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు... దీక్షను భగ్నం చేశారు. సీతక్కను అదుపులోకి తీసుకుని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.