'ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయకపోవడం బాధాకరం' - komatireddy rajgopal reddy
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు.

శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్కను మాట్లాడనీయకపోవడం బాధాకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన విషయాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వర్షభావం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నల్గొండ, యాదాద్రి జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శివన్నగూడెం, కృష్ణరాంపల్లి ప్రజలకు ఇటీవల మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన ప్యాకేజీనే అందించాలని విజ్ఞప్తి చేశారు. మూసినది కాల్వలు, ఉదయ సముద్రం ఆధునీకరణకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. ఈ మేరకు కేసీఆర్కు వినతి పత్రం ఇచ్చానని వెల్లడించారు.
- ఇదీ చూడండి : 'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'