రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ముఖ్యమంత్రి కేసీఆర్... పెన్షన్లపై మాట్లాడటం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతీ ఎన్నికలకు కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారని... ప్రజలు కూడా ఆయననే నమ్ముతున్నారన్నారు. అబద్ధాన్ని నిజం అని నమ్మించే చాతుర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు.
ప్రతీ ఎన్నికలకు కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారు: జగ్గారెడ్డి - జగ్గారెడ్డి వార్తలు
అబద్ధాన్ని నిజం అని నమ్మించే చాతుర్యం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సెప్టెంబరు 2 వరకు వేచి చూస్తానని... అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రగతి భవన్ ముందు దీక్షకు కూర్చుంటానని జగ్గారెడ్డి ప్రకటించారు.

Jaggareddy
కరోనా విపత్కర పరిస్థితుల్లోనైనా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2 వరకు వేచి చూస్తానని... అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రగతి భవన్ ముందు దీక్షకు కూర్చుంటానని జగ్గారెడ్డి ప్రకటించారు.