తెరాస, ఎంఐఎం, రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక పోలీసులు... అంతా కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తెరాస, ఎంఐఎం పార్టీలు రిగ్గింగ్, ఇతర పోల్ అవకతవకలకు పాల్పడినా... రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, పోలీసు అధికారులు కానీ ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఛైర్మన్ సమీర్ వాలిల్లా విమర్శించారు.
'ఎస్ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది' - sameer Waliullah on ghmc polling
జీహెచ్‌ఎంసీ పోలింగ్ సరళిపై కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఛైర్మన్ సమీర్ వాలిల్లా మండిపడ్డారు. తెరాస, ఎంఐఎం పార్టీలు రిగ్గింగ్, ఇతర పోల్ అవకతవకలకు పాల్పడినా... రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, పోలీసు అధికారులు కానీ ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
బోగస్ ఓటర్లను ఆపడానికి ప్రయత్నించిన అభ్యర్థులపై దాడి చేశారని... పోలింగ్ ఏజెంట్లను బెదిరించేందుకు యత్నించారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోడానికి తగిన సమయం ఇవ్వలేదని... ప్రచారానికి అక్షరాలా వారం రోజులు కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు.
ఓటర్లతో మాట్లాడేందుకు సమయం లేకపోవటం వల్ల అభ్యర్థులు పాదయాత్రలు, రోడ్ షోలు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై సమీర్ మండిపడ్డారు.