ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీల్లో చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్(huzurabad by election schedule) విడుదల చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ లేఖ రాశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల(huzurabad by election schedule)పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నిరంజన్.. ఈ నెల 8 న వీవీప్యాట్ల, ఈవీఎంల తనిఖీల్లో జరిగిన అవకతవకలను సరిద్దిద్దాలని నిరంజన్ డిమాండ్ చేశారు.
ఆయన నిర్వహించలేరు..
ఈవీఎం, వివీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీలను తిరిగి నిర్వహించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తూ.. అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ తన భాధ్యతలను నిర్వహించలేరని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నిర్వహణ కోసం మరో ఐఎఎస్ అధికారిని ఎన్నికల నిర్వహణాధికారిగా నియమించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను నిరంజన్ కోరారు.