కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ... కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదొస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 'స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ' పేరుతో రాజ్‌భవన్ వద్ద నిరసనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ప్రదర్శనకు బయలుదేరిన శ్రేణులను గాంధీ భవన్ బయట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి కోరారు.
రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు - స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ
'స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ' పేరుతో రాజ్ భవన్ వద్ద నిరసనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను భాజపా కూలదోస్తుందని ఆరోపించారు.
రాజ్ భవన్ వద్ద నిరసనకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం.. అరెస్టు
భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ హనుమంతరావు, గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి
Last Updated : Jul 27, 2020, 1:31 PM IST