హైదరాబాద్ గాంధీభవన్‌లో గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మహాత్ముడి విగ్రహానికి, చిత్రపటానికి ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.
మహాత్ముడికి కాంగ్రెస్ నేతల ఘన నివాళి - గాంధీభవన్‌లో గాంధీ వర్ధంతి కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్ముడి విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీభవన్‌లో నిర్వహించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, నాయకులు నిరంజన్, కుమార్ రావు, ప్రేమ్‌లాల్, నగేష్ ముదిరాజ్, ఉజ్మ షాకేర్, వెంకటస్వామి తదితరులు నివాళులర్పించారు.
ఇదీ చూడండి:'అహింస అనే ఆయుధంతో పోరాటాన్ని నడిపించారు'