తెలంగాణ

telangana

ETV Bharat / city

'న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల ప్రమేయం' - తెలంగాణ వార్తలు

పెద్దపల్లి జిల్లాలో అధికార తెరాస పార్టీ నాయకుల ప్రమేయంతో న్యాయవాద దంపతులని దారుణంగా హత్య చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

congress-leaders-revanth-komati-reddy-venkata-reddy-bhatti-reaction-on-lawyer-couple-murder
'తెరాస నాయకుల ప్రమేయంతో న్యాయవాద దంపతుల హత్య'

By

Published : Feb 18, 2021, 9:36 AM IST

న్యాయవాద దంపతుల హత్యను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పేందుకు ఈ ఘటనే సాక్ష్యమని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలో అధికార తెరాస పార్టీ నాయకుల ప్రమేయంతో న్యాయవాదిని దారుణంగా హత్య చేశారని విమర్శించారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన హత్య అని ఆరోపించారు.

వామన్‌రావుకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ, సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని కలిసి, వారికి న్యాయం చేయాలని కోరారు. నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరారు.

ఇదీ చూడండి: నేడు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిరసన

ABOUT THE AUTHOR

...view details