Congress Protest on Fuel: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీకేఆర్ కమాన్ వద్ద గ్యాస్ సిలిండర్లతో... మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి నిరసన వ్యక్తం చేశారు.
'కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పేద ప్రజల నడ్డి విరుస్తూ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. పేద ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ నుంచి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి తీసుకువచ్చాయి. ఈ ప్రభుత్వాలవి మాటలు తప్ప చేతలు లేవు. రెండు ప్రభుత్వాలు వరి కొనుగోలు విషయంలో గొడవ పడుతూ రైతులను నట్టేట ముంచుతున్నాయి.'