తెలంగాణ

telangana

ETV Bharat / city

'మసీదుల కూల్చివేతపై ఏఐఎమ్​పీఎల్​బీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి' - hyderabad news

రెండు మసీదుల కూల్చివేతపై ఏఐఎమ్‌పీఎల్‌బీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఏఐఎంపీఎల్‌బీకి చెందిన కొందరు సభ్యులు తెరాస ప్రభుత్వంలో అధికారిక పదవులను కలిగి ఉన్నందునే స్వేచ్ఛగా స్పందించలేకపోతున్నట్లు ఆ పార్టీ నాయకులు విమర్శించారు.

congress-leaders-on-masjid-demolition-in-secretariat
congress-leaders-on-masjid-demolition-in-secretariat

By

Published : Aug 19, 2020, 9:53 PM IST

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో రెండు మసీదుల కూల్చివేతపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు-ఏఐఎమ్‌పీఎల్‌బీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మసీదులను కూల్చివేయడం చట్టవిరుద్ధం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధమన్న విషయం తెలిసినప్పటికీ... ప్రభుత్వంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించడంలో కొంత గందరగోళానికి గురవుతోందని హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ మైనారిటీల విభాగం ఛైర్మన్ సమీర్ వలీ ఆరోపించారు.

ఏఐఎంపీఎల్‌బీకి చెందిన కొందరు సభ్యులు తెరాస ప్రభుత్వంలో అధికారిక పదవులను కలిగి ఉన్నందునే స్వేచ్ఛగా స్పందించలేకపోతున్నట్లు విమర్శించారు. ఒక వ్యక్తి మూఢ నమ్మకాల కోసం ముస్లిం, హిందూ రెండు వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం మసీదుల కూల్చివేత జరిగినా ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని ఆరోపించారు.

ఇదీ చూడండి :లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

ABOUT THE AUTHOR

...view details