తెలంగాణ

telangana

ETV Bharat / city

'కాంగ్రెస్​ ఏ ఒక్కరి సొత్తు కాదు.. అందుకే సీనియర్లమంతా కలిసి విందుకు వచ్చాం' - పీజేఆర్​ తనయుడు విష్ణువర్ధన్​రెడ్డిపీజేఆర్​ తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి

Congress Leaders meeting: పీజేఆర్​ తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి ఇంట్లో విందు సమావేశానికి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు హాజరయ్యారు. విందు అనంతరం మీడియా మాట్లాడిన నేతలు.. విష్ణువర్ధన్​రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. చివరివరకు కాంగ్రెస్​తోనే ఉంటారని స్పష్టం చేశారు.

Congress Leaders lunch meeting in vishnuvardhan reddy house
Congress Leaders lunch meeting in vishnuvardhan reddy house

By

Published : Jul 5, 2022, 3:56 PM IST

Congress Leaders meeting: దివంగత పి.జనార్దన్‌రెడ్డి తనయుడు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఏర్పాటు చేసిన విందు సమావేశానికి పార్టీ సీనియర్లు హాజరయ్యారు. హైదరాబాద్‌ దోమలగూడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో.. పార్టీ ముఖ్యనేతలు వీహెచ్‌, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య మళ్లీ విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో ఈ లంచ్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. విష్ణువర్ధన్​రెడ్డి పార్టీని వీడుతున్నట్టు వస్తున్న ప్రచారానికి.. ఈ విందులో తెరదించినట్టయింది.

పార్టీ సీనియర్లతో అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటానని విష్ణువర్ధన్​రెడ్డి స్పష్టం చేశారు. ఈ మధ్య చాలా గ్యాప్‌ వచ్చినందున వారిని లంచ్‌కు ఆహ్వానించానని.. వీహెచ్‌, మధుయాష్కీ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు వస్తామని చెప్పినట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ దిల్లీ పర్యటనలో ఉండటంతో ఆయన్ను ఆహ్వానించలేదన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆహ్వానిస్తే సాయంత్రానికి వస్తానని చెప్పారని విష్ణు తెలిపారు. ఉదయం నుంచే విష్ణువర్ధన్​రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తల సందడి నెలకొంది. అయితే.. లంచ్‌ సమయం దాకా.. సీనియర్​ నేతలు రాకపోవటంతో కొన్ని అనుమానాలు రేకెత్తాయి. అయితే.. అనూహ్యంగా.. అందరూ విందు సమయానికి నివాసానికి చేరటంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి.

ఇక విందుకొచ్చిన నేతలను విష్ణువర్ధన్​రెడ్డి సాధరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్ని అందించారు. విందు అనంతరం వీహెచ్​, మధుయాస్కీగౌడ్​ మీడియాతో మాట్లాడారు. విష్ణువర్ధన్​ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కుండబద్దలుకొట్టారు. చివరివరకు పార్టీలోనే విష్ణు కొనసాగుతారని.. దాన్ని బలపరించేందుకే సీనియర్లంతా విందుకు హాజరయ్యామని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని.. అందరూ కలిసి ఉంటేనే బలోపేతమవుతుందని హితవు పలికారు. పార్టీ నిర్ణయాన్ని మీరినట్టు తనపై వస్తున్న వార్తలకు ఇప్పుడే స్పందించనని.. సీనియర్లతో చర్చించాకే మాట్లాడతానని వీహెచ్​ తెలిపారు.

"జనార్దన్‌ రెడ్డి కుమారుడు పార్టీని వదిలే ప్రసక్తే లేదు. పార్టీ ఉన్నంతకాలం పార్టీతోనే విష్ణువర్ధన్‌రెడ్డి ఉంటారు. ఇతర పార్టీలోకి విష్ణు వెళ్తున్నారనేది దుష్ప్రచారం. కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరూ కలిసి ఉంటేనే పార్టీ నిలబడుతుంది. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అందరూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషిచేయాలి. తెరాస, భాజపాలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ఉండాలి. అందరి రాకతో అనుమానాలు పటాపంచలయ్యాయి." - వీహెచ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details